భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. దేశ స్థూల దేశీయోత్పత్తి 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంతో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత స్థానంలో నిలిచిందన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇదే విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. వికసిత్ భారత్ వైపు ఇది అతిపెద్ద అడుగు అని పేర్కొన్నారు. దీన్ని సాకారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 34