చైనాలో ఓ అద్భుతం జరిగింది. సాధారణంగా కవలలు పుట్టడమే అరుదు అనుకుంటే, ఒకే ప్రసవంలో ఏకంగా ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది ఓ 24 ఏళ్ల యువతి.నలుగురు ముద్దులమ్మాయిలు, ఒక బుజ్జి అబ్బాయికు జన్మనిచ్చి ఆ తల్లి ఒడి కలకలలాడుతూ. వైద్యులనే ఆశ్చర్యపరిచేలా చేసింది. 6 కోట్ల మందిలో ఒకరికి మాత్రమే సాధ్యమయ్యే ఈ అరుదైన ప్రసవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైద్యులే సవాల్‌గా తీసుకున్న కేసు.. 20 మంది వైద్యుల పర్యవేక్షణ
చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల దిలి అనే మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి వైద్యులు ఆమెను ఎంతో జాగ్రత్తగా పర్యవేక్షించారు. ఒకేసారి ఐదుగురు బిడ్డలు కడుపులో పెరగడం అంటే తల్లి ప్రాణానికి కూడా రిస్క్ ఉంటుంది. అందుకే ‘వుహాన్ యూనివర్సిటీ’ ఆసుపత్రిలోని దాదాపు 20 మంది నిపుణులైన వైద్య సిబ్బంది ఒక టీమ్‌గా ఏర్పడి ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా, తల్లీ బిడ్డలను సురక్షితంగా బయటకు తీశారు. తమ కెరీర్లో ఇలాంటి అరుదైన కేసును చూడటం ఇదే మొదటిసారి అని వైద్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.









