ఆటవిడుపుగా పేకాట ఆడటం తప్పు కాదు: సుప్రీం కోర్టు

జూదంలో భాగంగా ఆడితేనే తప్పు _ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఆడితే నేరమే _స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

గోల్డెన్ న్యూస్ /న్యూ ఢిల్లీ : పేకాట ఆడటం నైతికంగా తప్పు కాదని, సరదాగా సొంత వాళ్లతో ఆడితే నేరంగా భావించలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 

బెట్టింగ్,గ్యాంబ్లింగ్లో భాగంగా పేకాట ఆడితేనే నేరమని పేర్కొంది.

రోడ్డు పక్కన పేకాట ఆడాడనే కారణంతో కర్ణాటకలో హనుమంత రాయప్ప అనే వ్యక్తిని ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ బోర్డు డైరెక్టర్ పదవి నుంచి తొలగించడం సరికాదంది. వెంటనే ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Facebook
WhatsApp
Twitter
Telegram