గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలి

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం కరకగూడెం మండలంలో పారిశుద్ధ్యం పడకేసిందని ఎక్కడి చెత్త అక్కడే ఉంటుందని, డంపింగ్ యార్డ్స్ ఉన్న ఉపయోగంలో లేవని. గతంలో గ్రామ పంచాయతీ సర్పంచులు ఉన్న సమయంలో ట్రాక్టర్ ద్వారా ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించేవారు సర్పంచుల పదవి కాలము ముగిసి పోయిన తర్వాత  పారిశుధ్యం  నిర్వహణ బాధ్యతలను అధికారులు సొంత ఖర్చులతో నిర్వహించే వారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంంతో అధికారులు ప్రజా సమస్యలు పరిష్కరించ ఇబ్బందిగా మారిందని. ఉన్నతాధికారులు  ఇప్పటికైనా  గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించాలని. రానున్న వర్షాకాలం దృష్టి లో ఉంచుకొని  సీజనల్ వ్యాధులు రాాకుండా చర్యలు   చేేపట్టలని పినపాక నియోజకవర్గం టిడిపి నాయకులు చందా మధు కోరారు.

Facebook
WhatsApp
Twitter
Telegram