మావోయిస్టులకు సహకరించొద్దు. సీఐ

అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు మావోయిస్టులకు సహకరించవద్దు ఏడూళ్ల బయ్యారం సీఐ 

నిమ్మలగూడెం, నీలాద్రి పేట గండి ఆదివాసి గ్రామాలలో పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్.

ఆదివాసీ యువతకు వాలీబాల్ కిట్లు ,పిల్లలకు పలకలు పంపిణీ చేసిన కరకగూడెం పోలీసులు.

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం :అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు మావోయిస్టులకు సహకరించవద్దు ఏడూళ్ల బయ్యారం సీఐ అన్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్  ఆదేశాల మేరకు గురువారం కరకగూడెం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని నిమ్మలగూడెం, నీలాద్రిపేట గండి వలస ఆదివాసి గ్రామాలలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడూళ్ల బయ్యారం వెంకటేశ్వరరావు   మాట్లాడుతూ..  మావోయిస్టులకు ఆశయం ఇవ్వడం, సహకరించడం చేయకూడదని అన్నారు.ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తూ అభివృద్ధి దిశగా పయనించాలని సూచించారు.అభివృద్ధిని అడ్డుకునే మావోయిస్టులకు సహకరించవద్దని తెలిపారు.మావోయిస్టులవి కాలం చెల్లిన సిద్ధాంతాలని పేర్కొన్నారు. యువత,పిల్లలు విద్య ద్వారానే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు.అసాంఘీక శక్తులకు సహకరించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ అనవసరంగా కేసులు,జైలు పాలు కావద్దని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో. ఏడుల్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్ఐ పివిఎన్ రావ్ మరియు స్పెషల్ పార్టీ టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram