గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ : దేశంలోనే తొలిసారిగా మొబైల్లో ఓటింగ్ ,కొద్ది రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో భారత ఎన్నికల సంఘం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.
శనివారం రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని ఆరు మున్సిపల్ కౌన్సిళ్లకు జరిగే ఎన్నికల్లో దేశంలోనే తొలిసారిగా ఓటర్లు మొబైల్ యాప్ ద్వారా ఓటు వేసే సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నట్టు శుక్రవారం ప్రకటించింది.
మొబైల్ ఫోన్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించిన తొలి రాష్ట్రంగా బిహార్ నిలవనుంది. రేపటి మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో ఈ విధానాన్ని అమలు చేస్తోంది. పోలింగ్ కేంద్రాలకు రాలేనివారు దీనిని వినియోగించుకోవచ్చు. ఫోన్లో e-SECBHR యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి. ఫోన్ లేనివారు SEC వెబ్సైట్లో ఓట్ వేయొచ్చు. అయితే ఈ ఏడాది బిహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానం అమలుపై స్పష్టత లేదు.