విద్యార్థులకు ఉచితంగా నోటు బుక్స్, బ్యాగుల పంపిణీ

విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు , ఆట వస్తువులు పంపిణీ.

  గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి మంచిస్థాయికి చేరుకోవాలని  కరకగూడెం ఎస్సై పివిఎన్ రావు అన్నారు. మండలంలోని గొల్లగూడెం, కొత్తగూడెం ,ప్రాథమిక పాఠ శాలలో చదువుతున్న విద్యార్థులకు గూంజ్ సంస్థ సహకారంతో ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు’తోలెం రమేష్ ఆధ్వర్యం లో స్కూల్ బ్యాగులు నోట్‌ పుస్తకాలు, ఆట వస్తువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరకగూడెం ఎస్సై టీవీఎన్ రావు పాల్గొని విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు చేశారు.

ఈ సందర్భంగా ఎస్సై పివిఎన్ రావు మాట్లాడుతూ. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అభ్యసించడం వలన విద్యార్థులు ప్రతి రంగంలో ముందుంటున్నారు.విద్యార్థులు మంచి మార్గంలో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.సమాజ సేవ చేయడంలో ఎనలేని సంతృప్తి దాగివుంటుందని ప్రతీ ఒక్కరూ సమాజ  సేవ చేయడం అలవర్చుకోవాలన్నారు .విద్యార్థుల కోసం ఆధార్ స్వచ్ఛంద సంస్థ చేసిన సేవ అభినందనీయమని ప్రసంసించారు.ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు  సంస్థ నిర్వహకులు రమేష్ ను ఎస్సైప్రత్యేకంగా అభినందించారు.

 

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు  అ జయ్,సురేష్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాగేశ్వరావు,రాధ,శ్రీను,సంస్థ సభ్యులు బట్ట బిక్షపతి,గుడ్ల రంజిత్,ఇర్ప కుశేలుడు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram