వాట్సప్‌లో ఒకటి కంటే ఎక్కువ ఫొటోలు స్టేటస్ పెట్టుకునే వారి కోసం కొత్త ఫీచర్ అందుబాటు లోకి వచ్చింది. ఇదివరకు 4-5 ఫొటోలను కలిపి ఒకే స్టేటస్‌గా పెట్టాలంటే వాటిని ఏదైనా థర్డ్ పార్టీ యాప్‌లో ఎడిట్ చేయాల్సి వచ్చేది.
తాజాగా ఎక్కువ ఫొటోలను స్టేటస్ పెట్టుకునే వారికోసం బిల్ట్-ఇన్ ఎడిటర్‌ను వాట్సప్ తీసుకొచ్చింది. దీని సాయంతో ఒకేసారి 6 ఫొటోలను ఎంపిక చేసుకుని, మీకు నచ్చిన కొలేజ్ రూపొందించుకోవచ్చు.
Post Views: 58