తమిళనాడులో వింత సంఘటన జరిగింది. కల్లకురిచ్చి జిల్లా ఉళుందూర్ పేట సమీపంలోని సేందమంగళం గ్రామంలో ఈ వింత సంఘటన జరిగింది. ఆ ఊరిలో మనిషిని పోలిన మేక జన్మించింది. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. మేక మొత్తం మానవ పోలికలతో ఉండడంతో ఆశ్యర్చపోతున్నారు. ఈ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నెటిజెన్లు షేర్ చేస్తున్నారు.
Post Views: 42