గోల్డెన్ న్యూస్ / ఖమ్మం : కారేపల్లిలో యూరియా కోసం రైతులు శనివారం రాస్తారోకో నిర్వహించారు. అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుండడంతో తమ పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక సొసైటీ కార్యాలయానికి ఒక్క లారీ పంపిస్తే మండలంలో ఉన్న రైతులకు అవి ఎలా సరిపోతాయటూ అసహనం వ్యక్తం చేశారు. అక్కడికి వెళ్లిన ఎస్సై గోపి రైతులకు సర్ది చెప్పి వ్యవసాయశాఖ అధికారి అశోక్ కుమార్ మాట్లాడారు. ఉన్నత అధికారులతో మాట్లాడి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Post Views: 38









