మన్మోహన్ సింగ్ ఎర్త్ సెన్సెస్ యూనివర్సిటీ అద్భుత నిర్మాణం : మంత్రి తుమ్మల

⇒  భారతదేశంలోని మొట్టమొదటి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీగా ప్రఖ్యాతి,

⇒ తెలంగాణ ఖ్యాతిని పెంచేలా యూనివర్సిటీ నిర్మాణం,

⇒ అత్యాధునిక సౌకర్యాలతో 300 ఎకరాలలో అద్భుతమైన నిర్మాణం,

⇒ త్వరలోనే సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభోత్సవ వేడుక ,

⇒ అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,

 

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : ప్రపంచానికే మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని(కొత్తగూడెం) ఆదర్శంగా నిర్మించేలా అద్భుత ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలోని మంత్రి చాంబర్ లో ప్రముఖ ఆర్కిటెక్ ఉష రూపొందించిన కొత్తగూడెం మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ నిర్మాణ ప్లాన్ ను వైస్ ఛాన్స్ లర్ యోగితారాణా ఇతర అధికారులతో కలిసి మంత్రి తుమ్మల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికే తెలంగాణ రాష్ట్రంలోని మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ తలమానికంగా నిలిచేలా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో, అన్ని మౌళిక సదుపాయాలతో యూనివర్సిటీ నిర్మించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా నాణ్యత ప్రమాణాలతో పకడ్బందీగా ప్లాన్ ను రూపొందించాలని మంత్రి సూచించారు. విద్యార్థులు, లెక్చరర్లు అసౌకర్యం లేకుండా విశాలమైన తరగతి గదులు, హాస్టల్లు, గ్రంథాలయాలను నిర్మించాలన్నారు. ఆర్కిటెక్ తయారు చేసిన డిజైన్లను ముఖ్యమంత్రికి త్వరలోనే చూపించి, ఆయన ఆదేశాలకు అనుగుణంగా డిజైన్లను ఆమోదం తీసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ప్రారంభోత్సవ వేడుక నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. మీదుగాఈ విషయమై భద్రాద్రి కొత్తగూడం కలెక్టర్ తో మాస్టర్ ప్లాన్ గురించి మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భవనాలలోనే తాత్కలికంగా తరగతులు నిర్వహించాలని, హాస్టల్ భవనాలకు మరమ్మత్తులు చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. 3 సంవత్సరాలలో యూనివర్సిటీ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ అని.. ఇది తెలంగాణ రాష్ట్రానికే కాకుండా, దేశానికే తలమానికంగా ఆకర్షనీయమైన డిజైన్లతో దీనిని నిర్మించాలని అధికారులకు సూచించారు. ఈ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ 300 ఎకరాల విశాల ప్రాంతంలో రూపుదిద్దుకోని, అత్యున్నత ప్రమాణాలతో వేలాది మందికి విద్య ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారనుందని మంత్రి పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీ ద్వారా వేలాది మంది యువ శాస్త్రవేత్తల దేశ భవిష్యత్తుకు బాటలు వేసే అవకాశం ఏర్పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ నిర్మాణంతో వేలాదిమంది విద్యార్థుల ఉన్నత చదువులకు అవకాశాలు లభించడంతో పాటు శాస్త్రవేత్తలుగా తయారుచేసే అవకాశాలు కలుగుతాయని అభిప్రాయపడ్డారు. మంత్రి తుమ్మల ప్రత్యేక కృషి…మైనింగ్ కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చడంలో మంత్రి తుమ్మల కృషి అపారం. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు ఆయన శ్రమిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం మైనింగ్ కళాశాలను అప్గ్రేడ్ చేసి ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా మార్చడంలో కీలక భూమిక పోషించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటేలా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుకు ముఖ్యమంత్రిని ఒప్పించి కృతకృత్యులయ్యారు. ప్రపంచానికే తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయం కీర్తి ప్రతిష్టలు చాటేలా మంత్రి తుమ్మల విశేష కృషి చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఒప్పించి విశ్వవిద్యాలయంగా మార్చడంలో, బిల్లు ఆమో దించడంలో తుమ్మల చూపిన చొరవ మరువలేనిది. ఖమ్మం జిల్లా ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పేలా విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలనే దృఢ సంకల్పంతో మంత్రి తుమ్మల అలుపెరుగని పోరు చేస్తున్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram