మీ ఫోన్‌ను ఎవరైనా కొట్టేశారా?.. టెన్షన్ పడకండి.. ఈ టిప్స్‌ పాటించడండి

ప్రజెంట్‌ సాంకేతిక యుగంలో స్మార్ట్‌ఫోన్‌ లేనిదే మన పని గడవదు.

ఫోన్‌ను కేవలం కాల్స్ చేయడానికి మాత్రమే కాకుండా, మన మొత్తం జీవితంలో ఒక భాగంమైపోయింది.

ఆ ఫోన్‌లోనే మనకు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు, బ్యాంకింగ్ యాప్‌లు, వాట్సాప్ చాట్‌లు, సోషల్ మీడియా ఖాతాలు ఇలా అనేక ముఖ్యమైన పత్రాలు ఉంటాయి.

అలాంటప్పుడు మన ఫోన్‌ను ఎవరైనా కొట్టేసినా, లేదా మనమే అనుకోకుండా పోగొట్టుకున్నా.. ఆఫోన్ దొరికిన వాళ్లు ఏం చేస్తారు.

 

వాటిని ఉపయోగించి కొన్ని సార్లు క్రైమ్స్‌కు పాల్పడుతుంటారు.

 

మనం కూడా అలాంటి ప్రమాధాల భారీన పడకుండా ఉండాలంటే మీ ఫోన్‌ పోయిన వెంటనే ఈ కొన్ని టిప్స్‌ పాటించండి.

 

ట్రాఫిక్ పోర్టల్ ఉపయోగించండి.

 

ఒక వేళ మీ ఫోన్‌ పోయినా, లేదా దొంగలించబడిన వెంటనే చేయాల్సిన మొదటి పని ఏంటంటే.. సంచార్ సతి అనే ప్రభుత్వ పోర్టల్‌కు వెళ్లి ఈ IMEI, మీ వివరాలు ఇచ్చి కంప్లైంట్‌ నమోదు చేయండి. ఇలా చేయడం ద్వారా మీఫోన్‌ను దొంగలించిన వ్యక్తి మీ సిమ్‌ తీసి తన సిమ్‌ వేసుకున్నా.. దాన్ని ఉపయోగించలేడు. ఎందుకంటే దొంగలించిన వ్యక్తి మీ ఫోన్‌ను దుర్వినియోగం చేయంకుండా ఉండేందుకు టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) ఈ పోర్టల్‌ను సృష్టించింది. దీనిలోని సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (CEIR) ప్రతి మొబైల్ ఫోన్‌ IMEI నంబర్ ప్రకారం పనిచేస్తుంది. ఈ వ్యవస్థలో మీ ఫోన్ బ్లాక్ చేయబడినప్పుడు, ఎవరూ దానిని మరొక SIM కార్డ్‌తో ఉపయోగించలేరు.

 

IMEI బ్లాక్‌లిస్ట్ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి?

దొంగిలించబడిన వెంటనే మీ ఫోన్‌లోని IMEI నంబర్ బ్లాక్‌ చేయడంతో ఆ ఫోన్ ఏ నెట్‌వర్క్‌లోనూ యాక్టివ్‌గా ఉండదు. దొంగ ఫోన్‌ను తిరిగి ఆన్ చేస్తే, మొబైల్ ఆపరేటర్ వెంటనే అప్రమత్తమవుతారు. ఇది ఫోన్‌ను ట్రాక్ చేయడం సులభం చేస్తుంది అలాగే మీరు ఫోన్‌ దొరికే చాన్సెస్‌ ఎక్కువగా ఉంటాయి.

 

పోయిన మీ మొబైల్‌ను ఎలా బ్లాక్ చేయాలి?

 

దీని కోసం, ముందుగా మీ బ్రౌజర్‌లో www.sancharsaathi.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఇక్కడ ఇవ్వబడిన CEIR బ్లాక్ స్టోలెన్/లాస్ట్ మొబైల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక పేజ్‌ ఓపెన్‌ అవుతుంది. అక్కడ ఒ ఫామ్‌ కనిపిస్తుంది. ఆ ఫారమ్‌లో మీ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి, ఫోన్‌లోని IMEI నంబర్, ఇతర వివరాలను ఎంటర్ చేయండి. తర్వాత, FIR కాపీని లేదా ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను అప్‌లోడ్ చేయండి. అన్ని వివరాలను పూరించిన తర్వాత, దరఖాస్తును సమర్పించండి. దరఖాస్తు నమోదు అయిన వెంటనే, మీ ఫోన్ వెంటనే బ్లాక్ చేయబడుతుంది.అప్పుడు దాన్ని ఎవరూ ఉపయోగించలేరు.

 

మీ మళ్లీ దొరికితే ఏం చేయాలి

 

ఒక వేళ మీకు మీ ఫోన్‌ మళ్లీ దొరికితే.. దాన్ని ఎలా యూజ్ చేయాలని పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఫోన్‌ను మళ్లీ మీరు అన్‌బ్లాక్‌ చేసుకోవచ్చు. దీని కోసం మీరు మళ్ళీ సంచార్ సత్తి పోర్టల్‌కి వెళ్లి, అన్‌బ్లాక్ ఫౌండ్ మొబైల్ ఆప్షన్‌ను ఎంచుకోండి. ఇక్కడ మీరు మీ మునుపటి నివేదిక రిఫరెన్స్ నంబర్‌ను నమోదు చేయాలి. దీని తర్వాత మీ ఫోన్ అన్‌లాక్ చేయబడుతుంది. దీంతో మీరు దానిని సాధారణంగా ఉపయోగించుకోగలుగుతారు

Facebook
WhatsApp
Twitter
Telegram