UPI నుంచి తప్పుడు నెంబర్‌కు డబ్బులు పంపారా?, ఈ చిన్న టిప్స్‌తో ఈజీగా తిరిగి పొందండి

ప్రస్తుత సాంకేతిక యుగంలో, ప్రతీది డిజిటలైజేషన్ అయిపోయింది. భారత దేశంలోకి యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాక జనాలకు లావాదేవీలు జరపడం చాలా సులభమై పోయింది. ఒకప్పుడు బ్యాంక్‌ ఖాతా నుండి డబ్బు తీసుకోవాలంటే గంటల తరబడి క్యూలైన్‌లో నల్చోవాల్సి వచ్చేది కానీ, యూపీఐ సేవలు స్టార్ట్‌ అయ్యాక అత్యవసరమైతే తప్ప, బ్యాంక్‌ ముఖం చూడట్లేదు జనాలు. అయితే ఈ యూపీ సేవలు మన పనిని సులభతరం చేసినప్పటికీ వీటి వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మనకు కావాల్సినంత మొత్తం డబ్బును ఒకే సారి పంపలేము, ఇంకొకటి అనుకోకుండా తప్పుడు నెంబర్‌లకు డబ్బులు పంపడం. ఈ సమస్యను ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్నారు. తొందర్లొ ఒక నెంబర్‌కు పంపాల్సిన డబ్బులు మరొకరికి పంపి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇలా చేసినప్పుడు టెన్షన్ పడకుండా కొన్ని టిప్స్‌ పాటిస్తే మన డబ్బును ఈజీగా తిరిగి పొందవచ్చు. మన ట్రాన్సాక్షన్ హస్టరీ చెక్‌ చేసుకోవడం. మనం అనుకోకుండా వేరే నెంబర్‌కు డబ్బులు పంపినప్పుడు. ముందుగా మీరు చేయాల్సిన పని ఏమిటంటమే మీరు వెంటనే ఏ నెంబర్‌కు పంపారో ఆ నెంబర్‌ వివరాలను చెక్‌ చేయండి. తర్వాత UPI యాప్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌కు కాల్‌ చేసి మీ సమస్యపై వారికి కంప్లైంట్ చేయండి. మీరు పంపిన యూపీఐ ఐడీని వారికి ఫార్వడ్ చేయండి. దీని ద్వారా, వారు UPI యాప్ కస్టమర్ సర్వీస్ సెంటర్ ద్వారా మీ బ్యాంకును సంప్రదించి మీ డబ్బును తిరిగి పొందుతారు. మీ అకౌంట్‌ ఉన్న బ్యాంక్‌ను సంప్రదించండి. ఒక వేళ UPI యాప్‌ ద్వారా మీ సమస్య పరిష్కారం కాకపోతే మీరు వెంటనే మీ బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించండి లేదా బ్యాంక్ కస్టమర్ సర్వీస్ నంబర్‌కు కాల్‌ చేయండి. వాళ్లకు మీ డబ్బులు పంపిన యూపీ ID, మీరు ఏ రోజు ట్రాన్సాక్షన్ చేశారో అన్ని వివరాలను వారికి తెలియజేయండి. అప్పుడు బ్యాంక్‌ మీరు డబ్బు పంపిన వ్యక్తి మెసెజ్‌ పంపుతుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. UPI సేవలను అందించే కేంద్ర ప్రభుత్వ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కూడా మీ సమస్యపై మీరు ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంక్, UPI యాప్‌ల ద్వారా మీ సమస్య పరిష్కారం కాకపోతే మీరు NPCI వెబ్‌సైట్‌ లో ఫిర్యాదు చేయవచ్చు. దీని ద్వారా కూడా కొన్ని సార్లు మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఒక వేళ మీరు పంపిన డబ్బు పెద్దం మొత్తంలో ఉంటే, మీరు వెంటనే సమీపంలోని సైబర్ క్రైమ్ విభాగానికి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. మీరు పంపిన యూపీఐ ఐడీ, లేదా నెంబర్‌ ట్రాన్సాక్షన్ స్క్రీన్‌షాట్, ID వివరాలను మీరు సైబర్‌ క్రైమ్ పోలీసులకు అందించండి.వారు వెంటనే చర్య తీసుకొని మీ డబ్బును తిరిగి ఇప్పించేలా చూస్తారు. డబ్బులు పంపేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. డబ్బు పంపే ముందు ఎల్లప్పుడూ ఖాతా నంబర్ / మొబైల్ నంబర్‌ను రెండుసార్లు చెక్‌ చేయండి. QR కోడ్‌ను స్కాన్ చేస్తున్నప్పుడు, మీరు పంపిస్తున్న వారి పేరు కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోండి. పొరపాటున డబ్బు పంపినట్లయితే, వెంటనే పైన పేర్కొన్న టిప్స్‌ పాటించండి. మీరు లేట్‌ చేసే ప్రతి నిమిషం మీ డబ్బును తిరిగి పొందే అవకాశాలను తగ్గిస్తుందని గుర్తుంచుకోండి.

Facebook
WhatsApp
Twitter
Telegram