గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : లంచం తీసుకుంటూ జూనియర్ లైన్మెన్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. సిటీ రేంజ్ యూనిట్-1 ఏసీబీ అధికారులు వివరాల మేరకు.. గచ్చిబౌలి డివిజన్ పరిధి వసంత్ నగర్ విద్యుత్ ఉప కేంద్రంలో ఎ. శ్రీకాంత్ గౌడ్ నాలుగేళ్లుగా జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. ఎన్ఆర్ఎస్ఏ కాలనీకి చెందిన వినియోగదారుడు తన ఇంటికి సంబంధించి 5 కిలోవాట్ నుంచి 11 కిలోవాట్ వరకు పెంచేందుకు శ్రీకాంత్ గౌడ్ రూ.30వేలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో శుక్రవారం ఎస్ఆర్ఎస్ఏ కాలనీలో రూ. 11 వేలు ఇస్తుండగా డీఎస్పీ శ్రీనివాసరెడ్డి 10 మంది అధికారుల బృందంతో రెడ్్యండెడ్గా పట్టుకున్నారు. అనంతరం శ్రీకాంత్ గౌడ్ని నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. వసంతనగర్ సెక్షన్లో సోదాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Post Views: 62









