ఈనెల 30న తెలంగాణ రాష్ట్ర కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి
బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ లింగయ్య యాదవ్
గోల్డెన్ న్యూస్/సూర్యాపేట/ ఈనెల 30న జరిగే బందును విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ వీరబోయిన లింగయ్య యాదవ్ అన్నారు . సందర్భంగా స్థానిక సూర్యపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 8000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అదే విధంగా సంక్షేమ హాస్టళ్లకు సంత భవనాలు నిర్మించాలని అన్నారు .
ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు కాకపోవడంతో కళాశాల యజమాన్యాలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు . విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫీజుబకాయలు విడుదల చేయాలన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకుంటే ప్రభుత్వాలనీ ప్రశ్నిస్తారని ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం అన్నారు తక్షణమే ఫీజు బకాయిలు విడుదల చేయాలి లేనిపక్షంలో ముఖ్యమంత్రి ఇంటిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం ఈ బంధు కార్యక్రమంలో విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున బంద్ ను విజయవంతం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బోనగిరి సతీష్ నారా బోయిన లోకేష్ , అజయ్, వంశీ ,ధనుష్ , జీవన్ , శివకుమార్ తదితరులు పాల్గొన్నారు








