డ్రగ్స్ పై ఉక్కుపాదం.. హైదరాబాద్ సీపీ సజ్జనార్

హైదరాబాద్ నూతన పోలీసు కమిషనర్గా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. 

“దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్. 

ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డ్రగ్స్. 

దీనిపై ఉక్కుపాదం మోపుతాం. 

డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. 

ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుని ముందుకెళ్తాం. 

అవసరమైతే మరింత సిబ్బందిని కేటాయించి చర్యలు తీసుకుంటాం” అని పేర్కొన్నారు.

శాంతిభద్రతలు కాపాడుతాం

బాధ్యతలు స్వీకరించిన అనంతరం సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. సమర్థత, సమగ్రతతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు. ప్రజలతో మమేకమై, వారి భద్రతకు భరోసా కల్పించే దిశగా పోలీస్ శాఖ(Police Department) పనిచేస్తుందని వెల్లడించారు. నగరంలో శాంతి భద్రతలను కాపాడుకోవడంపై దృష్టి సారిస్తామన్నారు. ఇంత పెద్ద నగరం బాధ్యతలు అప్పగించడంపై ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నగరంలో డ్రగ్స్ అతి పెద్ద సమస్య అని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలతో యువత, వారి తల్లిదండ్రులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ దందా చేసే వారిని వదిలి పెట్టమని స్పష్టం చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram