గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : దేశ స్వాతంత్య్ర్యం కోసం ముందుండి దేశాన్ని నడిపించిన జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం మండల కేంద్రంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, మాజీ ZP చైర్మన్, తెలంగాణ గాంధీ స్మారక నిధి రాష్ట్ర బోర్డ్ మెంబర్ చందా B లింగయ్య దొర ముఖ్యఅతిథిగా పాల్గొని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత జాతిని ఏకతాటిపై నడిపించి బ్రిటీష్ సామ్రాజ్యంపై శాంతి, అహింసలతో పోరాడి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్ముడు చూపిన బాట, ఆయన ఆచరించిన విలువలు యువతరానికి ఆదర్శం కావాలని, అప్పుడే మనం కలలు కంటున్న నవ భారత నిర్మాణం సాధ్యం అవుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు డాక్టర్.చందా సంతోష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు గ్రామ పెద్దలు కొంపెల్లి రామలింగం , బైరిశెట్టి చిరంజీవి, చిట్టి ప్రసాద్ , గొగ్గల రవి , చందా రత్నమ్మ , చందా నాగేశ్వరరావు, గొగ్గలి కృష్ణ ,యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…









