గోల్డెన్ న్యూస్ /తాడ్వాయి : సోమవారం అటవీశాఖ అధికారులు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో సోమవారం అటవీ శాఖ అధికారులు, పోడు రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోడు భూముల్లో తుమ్మ చెట్లు నాటడాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అటవీ అధికారుల తీరును నిరసిస్తూ రైతులు నిరసన తెలిపారు. పోలీసుల జోక్యంతో ఈ ఆందోళన సద్దుమణిగింది.
Post Views: 52









