భూమికి మరో కొత్త చంద్రుడు.. గుర్తించిన పరిశోధకులు

భూమికి మరో కొత్త చంద్రుడు.. గుర్తించిన పరిశోధకులు!

భూమికి ఇప్పుడు రెండు చంద్రులు ఉన్నారనే వార్తలతో సోషల్ మీడియా హోరెత్తుతోంది.

 

ఈ వార్త కొంతవరకు నిజమే.

 

ఎందుకంటే రెండవ “చంద్రుడు” 2025 PN7 అనే చిన్న గ్రహశకలంతో ముడిపడి ఉందని తెలుస్తోంది.

 

దీనిని క్వాసి మూన్ అంటారు.

 

దీనిని మొదట హవాయి విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం ఒక సాధారణ టెలిస్కోప్ సర్వే సందర్భంగా గమనించింది.

 

హవాయిలోని మౌంట్ హలేకాలాపై ఉన్న పాన్-స్టార్స్ అబ్జర్వేటరీ ఆగస్టు 2, 2025న దీనిని కనుగొంది.

 

ఇప్పుడు US అంతరిక్ష సంస్థ NASA దీనిని ధృవీకరించింది.

 

అలాగే ఇది భూమి క్వాసి-మూన్ అని నమ్ముతుంది.

 

 

భూమి నుండి చూసినప్పుడు అవి చంద్రుడిలా సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తాయి కాబట్టి వాటిని చంద్రుడిలాగా పరిగణిస్తారు. అయితే ఇది నిజం కాదు. 2025 PN7 సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పటికీ, దాని కక్ష్య భూమి కక్ష్యను పోలి ఉంటుంది. ఇది మన గ్రహం వలె దాదాపు అదే సమయంలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఆగస్టు 2025లో హవాయిలోని పాన్-స్టార్స్ అబ్జర్వేటరీ ద్వారా మొదటిసారిగా గుర్తించబడిన ఈ గ్రహశకలం దాదాపు 20 మీటర్ల వెడల్పు కలిగి ఉండి దాదాపు 60 సంవత్సరాలుగా భూమిని వెంబడి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram