నేటి నుండి ఆధార్ అప్డేట్ లో కొత్త రూల్స్.

నవంబర్ 1 నుంచి ఆధార్ అప్‌డేట్స్‌లో పలు మార్పులు అమల్లోకి వచ్చాయి. ఆధార్ సేవలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా UIDAI కొత్త మార్గదర్శకాలు, ఫీ స్ట్రక్చర్‌ను ప్రకటించింది.

 

🔸 ఇంటి నుంచే ఆన్‌లైన్ మార్పులు:

ఇకపై ఆధార్‌లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. దీనికి రూ.75 చెల్లించాలి.

 

🔸 బయోమెట్రిక్ అప్‌డేట్స్ కేంద్రాల్లోనే:

ఐరిస్, ఫింగర్ ప్రింట్, ఫోటో వంటి బయోమెట్రిక్ వివరాలను మార్చుకోవాలంటే మాత్రం ఆధార్ సేవా కేంద్రానికే వెళ్లాలి. ఇందుకు రూ.175 చెల్లించాలి.

 

🔸 ఉచిత డాక్యుమెంట్ అప్‌డేట్ గడువు:

UIDAI ప్రకటించిన ప్రకారం, 2026 జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్లు ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంది.

💬 UIDAI తెలిపినట్లు, ఈ కొత్త మార్పులు ప్రజలకు సౌకర్యం కల్పించడమే కాకుండా, ఆధార్ డేటా ఖచ్చితత్వాన్ని కూడా మెరుగుపరుస్తాయని వెల్లడించింది.

Facebook
WhatsApp
Twitter
Telegram