అసాధ్యాలను సాధ్యం చేసే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఓ ఇంట్రెస్టింగ్ విషయం అనౌన్స్ చేశారు. తమ కంపెనీ నుంచి గాల్లో ఎగిరే కారును తెస్తున్నట్లు ఓ పాడ్కాస్ట్లో వివరించారు. ఈ ఏడాదిలోనే దానికి సంబంధించిన ప్రొటో టైప్ను ప్రదర్శిస్తామన్నారు. అయితే ఆ కారుకు రెక్కలుంటాయా? హెలికాప్టర్లా ఎగురుతుందా? అనే పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. తమ ఆవిష్కరణ ఊహలకు అందని విధంగా ఉంటుందని మాత్రం ఆయన స్పష్టం చేశారు.
Post Views: 13









