చూపులేని అభ్యర్థుల కోసం స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్
దృష్టిలోపం ఉన్న అభ్యర్థుల కోసం పరీక్షల్లో ‘స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్’ ఉపయోగించాలని UPSC నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, సాఫ్ట్వేర్ ఏర్పాటు అంశాలను పరిశీలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు విజ్ఞప్తి చేసింది. చూపులేని వారికి UPSC సమాన అవకాశాలు కల్పించడం లేదంటూ ఇటీవల సుప్రీంకోర్టులో పిల్ దాఖలవడంతో కమిషన్ చర్యలు చేపట్టింది..
Post Views: 10









