గోల్డెన్ న్యూస్ /కరీంనగర్ : తెలంగాణలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. జోగులాంబ, నల్గొండ, నారాయణపూర్ లాంటి ఘటనలు మరువకు ముందే తాజాగా తెలంగాణలో ఇదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. వాంతులు, విరేచనాలతో స్థానిక ఆస్పత్రులో 20 మంది బాలికలు చేరారు. బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటడంతో విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన నెలకొంది. కలుషిత ఆహారం తినడం వల్లే ఆహారం విషతుల్యం అయిందని పెరెంట్స్ చెబుతున్నారు.
Post Views: 17








