గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ : ఢిల్లీఎర్రకోట వద్ద భారీ పేలుడు కలకలం సృష్టించింది. ఎర్రకోట వద్ద కారులో భారీ పేలుడు ధాటికి ఐదుకార్లు ధ్వంసమయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. పేలుడుపై ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారిక ప్రకటన సైతం చేసింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్లోని గేట్ నెం. 1 సమీపంలో కారులో పేలుడు సంభవించినట్లు సమాచారం అందింది. ఆతర్వాత మూడు నాలుగు వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి’అని వెల్లడించింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది.
Post Views: 36








