గోల్డెన్ న్యూస్ /జగిత్యాల : జగిత్యాల జిల్లాలో తండ్రి తనకి వివాహ సంబంధాలు చూడటం లేదని తండ్రిని కర్రతో బాధి హత్య చేసిన కొడుకు
మెట్ పల్లి పట్టణంలోని బోయవాడలో తండ్రి గంగ నర్సయ్య ఉదయం లేచి ధ్యానం చేస్తున్న సమయంలో కొడుకు అన్వేష్ తనకు వివాహ సంబంధాలు చూడటం లేదని తండ్రి తో వాదన పెట్టుకున్నాడు. తండ్రి, కొడుకులకు మాట మాట పెరిగి పక్కనే ఉన్న కర్ర తో కొడుకు అన్వేష్ తండ్రి తల పై బాధడం తో తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే అన్వేష్ చిన్న అక్క భర్త అయిన నరేష్ కు ఫోన్ చేసి గొడవ విషయం తెలుపడంతో భార్య హారిక తో కలిసి ఘటన స్థలానికి (గంగ నర్సయ్య) ఇంటికి చేరుకుని రక్త గాయాలతో ఉన్న తండ్రిని మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలుపడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స అందించగా చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్సై పబ్బ కిరణ్ కుమార్ తెలిపారు. మృతుని కూతురు హరిని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.








