జూబ్లీహిల్స్ ఎన్నికలలో గెలుపు మాదే 

జూబ్లీహిల్స్ ఎన్నికలలో గెలుపు మాదే..

ఓటమి భయంతో దిగజారి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి…

టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు

గోల్డెన్ న్యూస్ /మణుగూరు :  భద్రాద్రి మణుగూరు నిన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికలలో గెలుపు BRS పార్టీ దని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నాడు, బుధవారం స్థానిక మౌనిక రెస్టారెంట్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతాయి అన్నారు, ఎన్నికల కోసం దొంగ ఓట్లు సృష్టించి, గందరగోళం చేసిన అధికార పార్టీ అయినా స్థానిక ప్రజలు మాత్రం  బి ఆర్ఎస్ పార్టీకే పగ్గం కట్టారని ఆయన అన్నారు మా పార్టీ సర్వే ప్రకారం కాంగ్రెస్ బిజెపి పార్టీల పై 100 కి 100% అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నామని రేగా కాంతారావు అన్నారు, ఓటమి భయంతో మా రాజ్యసభ సభ్యులు, MP లపై భౌతిక దాడులు మా నాయకుడు KTR పై దిగజారి మాట్లాడటం చాలా దురదృష్టకరమన్నారు, ఓటమి తప్పదని ముఖ్యమంత్రి దిగజారి మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశాడు, నాలుగు కోట్ల ప్రజానీకం సమాధానం చెప్పే రోజు వస్తుందని, ఆరోజు కాలమే నిర్ణయిస్తుందని ఆయన అన్నారు .

ఒక మహిళపై గెలుపు కొరకు కాంగ్రెస్ ,బిజెపి , ఎంఏఎం, ఎన్నికల కమిషనర్ ,పోలీసులు పనిచేసిన, మా కార్యకర్తలపై భౌతిక దాడులు చేసిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారన్నారు .

పార్టీ ఆదేశాలు మే రకే పనిచేస్తున్నాను ………..

బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు మేరకే నేను పని చేస్తున్నానని జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు కొత్తగూడెం నియోజకవర్గం లో నూతనంగా ప్రకటించిన మండల కన్వీనర్ పదవులకు జూనియర్లు సీనియర్లు అనే కాకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే పదవులు వస్తాయని ,అన్ని పరిశీలించినంకనే పదవులు ఇస్తామని అన్నారు , స్థానిక ఎమ్మెల్యేలు కేవలం అభ్యర్థి పేరు సిఫార్ చేయడం మాత్రమే కానీ పదవులు ఎవరికి ఇయ్యాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు , త్వరలో మా నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని అన్ని సమస్యల పరిష్కారం అవుతాయని ఆయన తెలిపారు ఈ సమావేశంలో BRS పార్టీ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, యాదగిరి గౌడ్, అప్పారావు, రాంబాబు , మధు, రామకోటి ,శీను సృజన్, తదితరులు పాల్గొన్నారు

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram