నిజామాబాద్ మెడికల్ కాలేజీ సుదర్శన్ రెడ్డి ఘనతే

సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులు కాదు జిల్లా నుంచి ఆయనే మంత్రి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

గోల్డెన్ న్యూస్ / నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా క్యాబినెట్ హోదాతో నుంచి ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన సుదర్శన్ రెడ్డి జిల్లా నుంచి ఆయనే మంత్రి అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా నిజామాబాద్ జిల్లాకు రావడంతో ఆయనకు స్వాగత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజీ తెప్పించిన ఘనత సుదర్శన్ రెడ్డి చొరవతో వచ్చిందన్నారు. గత ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు దండుకుందన్నారు. సోనియా మహా దేవత లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, ఇచ్చేది కాదని, 35ఏళ్ల కల ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చామన్నారు. కరీంనగర్ – నిజామాబాద్ టెంపుల్ కారిదార్ 360 కోట్ల రోడ్డు నిధులు మంజూరు అయ్యాయన్నారు. త్వరలో లింబాద్రి గుట్ట, సిద్దుల గుట్ట వద్ద పర్యాటక గెస్ట్ హౌజ్ కట్టబోతున్నామన్నారు. నిజామాబాద్ ಜಿಲ್ಲಾ వ్యవసాయ, విద్యా, వైద్యపరంగా ముందంజలో ఉంచబోతున్నామని, బోధన్ లో పామాయిల్ ఫ్యాక్టరీ త్వరలో ఏర్పాటు చేయబోతున్నామన్నారు. పనీచేసే వారికి గుర్తింపు కల్పిస్తామని, భవిష్యత్ లో ఫ్యాక్టరీలు జిల్లా కు రానున్నాయన్నారు. గత ప్రభుత్వం హయాంలో రావాల్సిన నిధులు, నేతలు ప్రజల ఆస్తులను ధ్వంసం చేసి డబ్బులు దోచుకెళ్లారన్నారు. 42% బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అర్వింద్ నోరు మెదపడం లేదన్నారు. దేవుడు పేరు మీద ఓట్లు అడిగేవారికి భవిష్యత్ లో ది చెప్పాలన్నారు..

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram