జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‌ కు సర్వం సన్నద్ధం.  

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‌ కు సర్వం సన్నద్ధం.  

జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ 

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‌ కు సర్వం సన్నద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు.

 

ఈ నెల 14 వ తేదీన ఎన్నిక కౌంటింగ్ నేపథ్యంలో గురువారం యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలోనీ మీడియా సెంటర్ లో పాత్రికేయులకు కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి వివరించారు.

 

నవంబర్ 14వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేస్తామన్నారు. 

 

 నోటా తో కలిపి 59 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున

ఈసీఐ నుండి ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ సారి 42 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గరిష్టంగా 10 రౌండ్ లు చేస్తారని చెప్పారు.

 

కౌంటింగ్ ప్రక్రియను ఈసీఐ

 సాధారణ పరిశీలకులు , ఈసీఐ బృందం పరిశీలిస్తారని చెప్పారు.

 

కౌంటింగ్ ప్రక్రియకు 186 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. వీరిలో కౌంటింగ్ సూపర్ వైజర్ లు, కౌంటింగ్ అసిస్టెంట్ లు, కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్స్ ఉంటారని అన్నారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram