ఘోరప్రమాదం.. హైవేపై 6 వాహనాలను ఢీకొట్టిన ట్రక్కు

ఘోరప్రమాదం.. హైవేపై 6 వాహనాలను ఢీకొట్టిన ట్రక్కు 

రెండు ట్రక్కుల మధ్య నలిగిన కారు..మంటలు చెల రేగి కారులో ఉన్న 8మంది సజీవదహనం..మృతుల సంఖ్య పెరిగే అవకాశం అంటున్న పోలీసులు

 

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గురువారం (నవంబర్ 13) పూణేలోని నవ్లే బ్రిడ్జిపై ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రెండు కంటైనర్ ట్రక్కులు ఢీకున్నాయి. వాటిలో ఒకటి మంటల్లో చిక్కుకుంది. రెండు ట్రక్కుల మధ్య ఒక కారు ఇరుక్కుపోయి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది సజీవ దహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి సహాయక చర్యలు చేపట్టారు. కాలిపోతున్న వాహనాల్లో మరింత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు

 

 

ప్రమాదం ఎలా జరిగిందో మేము దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం, గాయపడిన వారికి తక్షణ ఆసుపత్రి చికిత్స అందేలా చూడడమే మా ప్రాధాన్యత అని ఒక పోలీసు అధికారి తెలిపారు. అగ్నిమాపక శాఖ సంఘటనా స్థలానికి నీటి ట్యాంకర్లను పంపిందని, మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ ఘోర ప్రమాదం రద్దీగా ఉండే హైవేపై జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram