గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది, చత్తీస్గడ్ అడవుల్లో మరోసారి తుపాకుల మోత మోగింది, తాజాగా సూక్మా జిల్లాలో మావోయిస్టులు పోలీసులకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం…
తెలిసిన వివరాలు ప్రకారం…. చింత గుఫా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కరిగుండం అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి, ఈ ఎన్కౌంటర్లో ఇప్పటికే ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు మరోవైపు సంఘటన స్థలం నుంచి ఆయుధాలు పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Post Views: 112









