ఏసీబీ వలలో ఇల్లందు సివిల్ సప్లై డీటీ

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : ఇల్లందు తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం అనిశా ఆధికారులు డిఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి.నిర్వహించారు. రేషన్ డీలర్ల నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ యాకూబ్ పాషా ఏసీబీకి పట్టుబడ్డార. గత నెలలో ఒక రేషన్ షాపు తనిఖీ చేసి స్టాక్ తక్కువగా ఉందని కేసు నమోదు చేశారు. షాపును సీజ్ చేశారు. విజయ్ అనే అసిస్టెంట్ ద్వారా డబ్బులు అడిగించారు.అసోసియేషన్ అధ్యక్షులు శబరిష్ ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీ కి  పట్టుబడ్డారు. ఈ కేసులో డిప్యూటీ తహసీల్దార్, యాకుబ్ పాషా, విజయ్,శబరిష్ లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో లంచం ఇస్తున్న వ్యక్తిని కూడా ఏ సీ బి అరెస్టు చేసింది

Facebook
WhatsApp
Twitter
Telegram