ఎన్ కౌంటర్ పలువురు మావోయిస్ట్ అగ్రనేతలు మృతి

 

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టారు.

 

అక్కడి లోతట్టు అటవీ ప్రాంతాల్లో మావోయిస్ట్ నేతలు షెల్టర్ తీసుకున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందడంతో, భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కాల్పులు జరిపాయి. ఎక్స్ చేంజ్ ఆఫ్ ఫైర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం.

 

ఈ విషయంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయని తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని, వారిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఉన్నారని స్పష్టం చేశారు.

 

ఎన్ కౌంటర్ ప్రదేశానికి చేరుకున్న పోలీస్ బలగాలు.. హిడ్మా తో పాటు ఉన్న మిగతా మావోయిస్ట్ నేతలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర హోమ్ శాఖ అధికారులు నేరుగా ఎన్‌కౌంటర్ సమాచారాన్ని సేకరిస్తున్నరూ..

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram