గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం స్పెషల్ సబ్ జైల్ లో అగురుబత్తి నూతన యూనిట్ ని తెలంగాణ జైల్ శాఖ DG సౌమ్య మిశ్రా IPS బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పవిత్ర దేవస్థానాల్లో భద్రాచలంలో ప్రతిరోజు సమర్పించే పుష్పాలను సేకరించి, వాటిని బొగ్గు లేకుండా, పర్యావరణ రహిత, సువాసనతో కూడిన అగరు బత్తీలుగా మార్చడమే ఈ యూనిట్ ఒక ప్రత్యేకత అని ఆమె అన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఖైదీలకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించేందుకు ఈ నమూనా దోహదపడుతుందని అన్నారు. జైళ్లు కేవలం నిర్బంధ కేంద్రంగా కాకుండా పరివర్తన నైపుణ్య, అభివృద్ధి, కొత్త ఆశల కేంద్రాలుగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట IAS, ఐజి ప్రిజన్స్ మురళి బాబు, వరంగల్ రేంజ్ డిఐజి ప్రిజన్స్ సంపత్, భద్రాచలం స్పెషల్ జైల్ సుపరిండెంట్ ఉపేందర్, జైలు సిబ్బంది పాల్గొన్నారు.









