సారు మీ కాళ్లు మొక్కుతా పత్తి కొనుగోలు చేయాలని రైతు ఆవేదన.
గోల్డెన్ న్యూస్ / జడ్చర్ల : సీసీఐ కొనుగోలు కేంద్రంలో మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నాం. తమ పత్తి కొనుగోలు చేయండి అంటూ సీసీఐ అధికారుల కాళ్లు మొక్కాడు ఓ రైతు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడం కష్టంగా మారింది. పండించిన పంటలో సగం కూడా కొనని సీసీఐ, మిగతా పత్తి కూడా కొనాలంటూ అధికారుల కాళ్ల మీద పడి వేడుకున్న రైతు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఇండస్ట్రియల్ పార్కులో సీసీఐ ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రానికి, తాను పండించిన 90 క్వింటాళ్ల పత్తి తీసుకువచ్చిన అలంపూర్ ప్రాంతానికి చెందిన మల్లేశ్ అనే రైతు.దాదాపు 30 క్వింటాళ్ల పత్తిని వాహనం నుండి దింపిన తరువాత, పత్తి నాసిరంకంగా ఉందని, మిగతా పత్తిని కొనలేమని తేల్చి చెప్పిన సీసీఐ అధికారులు. దీంతో అంతా ఒకటే రకం పత్తి సారు, మిగతా పత్తి కూడా కొనండి సారు అంటూ అధికారుల కాళ్ల మీద పడి ప్రాధేయపడిన రైతు మల్లేశ్.మరో స్లాట్ బుక్ చేసుకుని, పత్తిని తర్వాత తీసుకురమ్మని రైతుకు తేల్చి చెప్పిన అధికారులు.
ఇప్పటికే వాహనం అద్దె భరించలేకపోతున్నానని, ఇంకో స్లాట్ బుక్ చేస్తే నా వంతు ఎప్పుడు వస్తుందో తెలియదని ఆవేదన వ్యక్తం చేసిన మల్లేశ్








