కోటి రూపాయలు విలువైన భూమిని 16 లక్షలకు ఇచ్చేది లేదు

కోటి రూపాయలు విలువైన భూమిని 16 లక్షలకు ఇచ్చేది లేదని తెలిసి చెప్పిన రైతులు 

పంచాయతీ కార్యాలయంలో అధికారులను బంధించిన రైతులు

 

గోల్డెన్ న్యూస్ / సంగారెడ్డి – ట్రిపుల్ ఆర్ రోడ్డు ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణకు చౌటకూర్ మండలం శివ్వంపేట గ్రామములో నోటీసులు అందజేయడానికి వెళ్లిన ఆర్ ఐ ప్రమోద్, జిపిటీ ప్రవీణ్ లను స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించిన రైతులు

ఎకరాకు రూ.16 లక్షలు చెల్లించేందుకు నోటీసులు ఇవ్వడానికి వచ్చినట్లు అధికారులు చెప్పగానే రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు

ఎకరా భూమి రూ.కోటి పలుకుతుంటే రూ.16 లక్షలు ఇస్తామంటే ఒప్పుకోమని రైతులు అధికారులను బలవంతంగా కార్యాలయంలోకి లాక్కెళ్లి బంధించారు

విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ అనీల్ కుమార్ పోలీసు సిబ్బందితో శివంపేటకు చేరుకొని రైతులకు నచ్చజెప్పి అధికారులను విడిపించారు

కొద్దిసేపు సీఐతో రైతులు వాగ్వివాదానికి దిగగా తాను ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోను రూ.16 లక్షలకు విలువైన భూములు ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పారు

Facebook
WhatsApp
Twitter
Telegram