మావోయిస్టు పార్టీకి మరో షాక్‌.

తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ఎదుట గంగిపోయిన. 37 మంది  మావోయిస్టులు.

లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్, నారాయణ అలియాస్ రమేశ్, సోమ్ అలియాస్ ఎర్ర ఉన్నట్లు డీజీపీ వెల్లడించారు. మిగతా 34 మంది మావోయిస్టులంతా ఛత్తీస్ ఘడ్  రాష్ట్రానికి చెందిన వారని తెలిపారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు, తొమ్మిది మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు, 22 మంది దళ సభ్యులు ఉన్నట్లు తెలిపారు. అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు వీరంతా జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చినట్లు డీజీపీ వెల్లడించారు. లొంగిపోయిన వారంతా తమ ఆయుధాలను కూడా అప్పగించినట్లు తెలిపారు. 37 మందికి తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేలు అందజేసినట్లు తెలిపారు. 303 రైఫిల్స్‌, జీ3 రైఫిల్స్‌, ఏకే 47లు, ఎస్‌ఎల్‌ఆర్‌, భారీగా బుల్లెట్స్‌ అప్పగింత. లొంగిపోయిన వారిలో 25 మంది మహిళా మావోయిస్టులు. కోయ సాంబయ్య అలియాస్ ఆజాద్‌ 31 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడని అన్నారు. మిగతాా వాళ్లు  కూడా తొందరగా లొంగిపోవాలని సూచించారు. తెలంగాణకు చెందిన మరో 59 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారు. వారిలో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవీ, పాక హనుమంతు అలియాస్ గణేశ్, బడె చొక్కారావు అలియాస్ దామోదర్. అంతేకాకుండా రాష్ట్ర కమిటీలో 10 మంది ఉన్నారు. వీళ్లంతా వీలైనంత త్వరగా లొంగిపోవాలని డీజీపీ శివధర్రెడ్డి  సూచించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram