లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్

గోల్డెన్ న్యూస్ / ఆర్మూర్ / ఏసీబీ అధికారులు ఎన్ని దాడులు నిర్వహిస్తున్న అవినీతి అధికారులు మారడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు చేపడుతున్నా భయపడటం లేదు. తమ వద్దకు వచ్చే ప్రజలను లంచాల పేరిట పట్టి పీడిస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్, అతని డ్రైవర్ (ప్రైవేట్ వ్యక్తి)ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పట్టణ పరిధిలో నిర్మించిన ఇంటికి నంబర్ కేటాయించడానికి మున్సిపల్ కమిషనర్ రాజు రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గురువారం మున్సిపల్ కమిషనర్  తన డ్రైవర్ భూమేశ్ ద్వారా లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం డ్రైవర్ బ్యాగ్ చెక్ చేయగా.. లెక్కల్లో చూపని రూ.4.30 లక్షల నగదు గుర్తించారు. ఆ డబ్బును స్వాధీనం చేసుకొని కమిషనర్ తో పాటు డ్రైవర్ను అరెస్ట్ చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram