రెచ్చిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / మండలంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా బుధవారం రాత్రి  మోత ఫీడర్ లోని ట్రాన్స్‌ఫార్మర్‌ను చోరీ చేశారు. మండలంలో గత కొద్ది రోజుల వ్యవధిలోనే 4 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గుయ్యాయి. వీటి విలువ లక్షల్లో  ఉంటుందని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.  రేగళ్ల పంచాయతీలో ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురైనట్టు ఆ గ్రామాల ప్రజలు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.  వ్యవసాయ పొలాలకు ఏర్పాటుచేసిన జన సంచారం లేని నిర్మాణస్య ప్రదేశాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల లక్ష్యంగా చోరీ చేస్తున్నట్టు విద్యుత్‌ శాఖ సిబ్బంది చెబుతున్నారు. దొంగలు సులభంగా విద్యుత్‌ కనెక్షన్‌ తప్పించి, ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్‌ వైరును వేరు చేసి పట్టుకెళ్లిపోతున్నారని చెబుతున్నారు. ఒక్కొక్క ట్రాన్స్‌ఫార్మర్‌ విలువ రూ.1.5లక్షలు ఉంటుందని వారు తెలిపారు. మండలం మోతే ఫీడర్లో రెండు ట్రాన్స్ఫరాల కాపరు చోరీ  చేసినట్లు  తమకు సమాచారం వచ్చిందని కరకగూడెం విద్యుత్‌ శాఖ ఏఈ నరహరి రాజశేఖర్ తెలిపారు. చోరీకి గురైన వాటి స్థానంలో కొత్తవి వేయడం ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల చోరీపై  స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram