గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ / ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి చిక్కాడు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం లంచం తీసుకుంటున్న ఇన్ ఛార్జి సబ్ రిజిస్ట్రార్ ను అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
వికారాబాద్ జిల్లాలోని తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సాయికుమార్ ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ గా వ్యవహరిస్తున్నాడు. ఓ వ్యక్తికి సంబంధించిన 11 ప్లాట్లలో రిజిస్ట్రేషన్ అయిన 4 ప్లాట్ల దస్తావేజులను అప్పగించడంతో పాటుగా మిగిలిన 7 ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆయన లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుదారుడి నుంచి రూ.16,500 లంచం తీసుకుంటుంగా.. ఏసీబీ అధికారులు ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ సాయికుమార్తో పాటు డాక్యమెంట్ రైటర్ డి సాయికుమార్, అసిస్టెంట్ డాక్యమెంట్ రైటర్ డి అశోక్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.









