లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్

గోల్డెన్ న్యూస్ / హనుమకొండ / శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్ లో  ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఓ ప్రైవేట్ స్కూల్ అనుమతి పునరుద్ధరణకు 60 వేల రూపాయలు డిమాండ్ చేసి  సంస్థ యాజమన్యం నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిని అనీశా అధికారులు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. వెంకట్ రెడ్డి ప్రస్తుత హనుమకొండ డీఈవోగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ స్థాయి అధికారి లంచం తీసుకోవడం పట్టుబడడంపై  చర్చనీయాంశంగా మారింది..

ఆయనతోపాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్ ను కూడా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram