గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / ప్రశాంతమైన వాతావరణంలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుపుకోవాలని, ఏడుళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు కోరారు. ఈ మేరకు సోమవారం కరకగూడెం మండలంలోని సమత్ భట్టుపల్లి, భట్టుపల్లి గ్రామాలను కరకగూడెం ఎస్సై పీవీఎన్ రావ్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు, రాజకీయ నాయకులకు అవగాహన కల్పించారు. ఎన్నికల్లో ఓటర్లను డబ్బు మద్యంతో మభ్య పెడితే చర్యలు తప్పమన్నారు.
♦ గ్రామస్తులు అందరూ కూడా ఎన్నికలు ను ప్రశాంతమైన వాతావరణం లొ జరగటానికి ప్రతి ఒక్కరు తమ తోడ్పాటు అందించాల
♦ ఎవరు కూడా అనవసరం గా గొడవలు పెట్టుకోవడం ఒకరిని ఒకరు దుశించుకోవడం లాంటివి చేయకూడదు అలా ఎవరు అయినా పాల్పడితే వారి పై చట్ట పరంగా చర్యలు తీసుకోపడతాయి అని హెచరించడం జరిగింది
♦ ఎన్నికలు రోజున ఎలాంటి విజయోత్సవ ర్యాలీ లు కానీ చేయకూడదు అలా ఎవరు చేసినట్లయితే వారి పై చట్ట పరంగా చర్యలు తీసుకోబడతాయి
♦ ఎవరు అయినా పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లు పట్ల బెదిరింపులు కు పాల్పడిన వారిని ప్రలోభ పెట్టిన వారి పై చట్ట పరంగా చర్యలు తీసుకో బడతాయి
♦ పోలింగ్ కేంద్రాలు వద్ద కానీ, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఎవరు అయినా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తే వారిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించిది లేదు వారి పై చట్ట పరంగా చర్యలు తీసుకోబడతాయి అని హెచ్చరించడం జరిగింది
♦ పోలింగ్ కేంద్రాలు వద్ద 163 BNSS (144 CRPC) సెక్షన్లు అమలులో ఉంటాయని ఎవరు కూడా గుంపులు గా సంచరించవద్దని సూచించారు. అభ్యర్థులు , ఓటర్లు పోలీస్ వారికి సహకరించగలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.









