బాలుడి విక్రయం కలకలం
గోల్డెన్ న్యూస్ / నిజామాబాద్ / ఎల్లమ్మగుట్టలో బాలుడి విక్రయ ఘటన తీవ్ర కలకలం రేపింది. కన్న తల్లి తన సొంత బిడ్డను మహారాష్ట్రలోని పూణేలో రూ.2.40 లక్షలకు విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
పోలీసులు వేగంగా స్పందించి బాలుడి తల్లితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. బాలుడిని గుర్తించి రక్షించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Post Views: 36









