ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే సర్పంచ్ మృతి.
గోల్డెన్ న్యూస్ / న్యాల్కల్ / పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన పైమిర్జాపూర్ (ఎన్) గ్రామ సర్పంచ్ ఎర్రోళ్ల అక్కమ్మ బుధవారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివారాల ప్రకారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మిర్జాపూర్ (ఎన్) గ్రామానికి చెందిన అక్కమ్మ (65), కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 60 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ, ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె, ఇటీవల జరిగిన ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోయారు.అధికారుల సూచన మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి , గ్రామస్ఆ సుపత్రికి వెళ్లి ప్రమాణ స్వీకారాన్ని చేయించారు.
Post Views: 93









