ముగ్గురు చిన్నారులకు విషమిచ్చి తాను ఉరి వేసుకున్న తండ్రి.
ఆనందంగా కొత్త సంవత్సర సంబరాలు చేసుకుందామనుకున్న ఆ చిన్నారుల బతుకులు తెల్లారేలోగా తెల్లారిపోయాయి. శీతలపానీయం, పాలల్లో నాన్న కలిపిన కాలకూట విషం వారి ఆశల్నే కాదు, జీవితాలనూ చిదిమేసింది. కనిపెంచిన తండ్రే.. ముగ్గురు బిడ్డల ఉసురు తీయడంతో పాటు తాను ఉరివేసుకొన్న దారుణం నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలోని తుడుములదిన్నె గ్రామంలో జరిగింది.గ్రామంలో జరిగింది.
పోలీసులు, స్థానికుల కథనం.. వేములపాటి సురేంద్ర(35), గృహ నిర్మాణ కార్మికుదుగా పనిచేస్తున్నడు మహేశ్వరిని ఎనిమిదేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు . భార్య మహేశ్వరి అనారోగ్యంతో గతేడాది ఆగస్టులో ఆత్మహత్య చేసుకుంది. సురేంద్ర తల్లి చనిపోగా, తండ్రి కృష్ణవేణిని రెండో వివాహం చేసుకున్నారు. నాలుగు నెలలుగా సురేంద్ర రోజంతా పనులకు వెళ్తుంటే. చిన్నారులు కావ్యశ్రీ(7), ధ్యానేశ్వరి(4), సూర్యగగన్(2)ల ఆలనాపాలనా అతని సవతి తల్లి కృష్ణవేణి చూసుకుంటున్నారు. రోజూ మాదిరిగా గురువారం ఉదయం ఆమె పిల్లలను నిద్ర లేపేందుకు వెళ్లగా, ఎంతకీ తలుపు తీయకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులు పగలగొట్టి చూడగా ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా పడి ఉన్నారు. పక్కనే ఉరి వేసుకొని వేలాడుతున్న సురేంద్ర కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇచ్చా ర ఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు విచారణ జరుగుతున్నారు.









