కాలేజీ బస్సు బోల్తా విద్యార్థులకు గాయాలు

గోల్డెన్ న్యూస్ / అశ్వాపురం /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మండికుంట వద్ద ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులతో వెళుతున్న బస్సు శుక్రవారం బోల్తా పడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాల్వంచ మండలంలోని కేఎల్‌ఆర్‌ కళాశాలకు చెందిన బస్సు.. మణుగూరు  నుంచి విద్యార్థులతో పాల్వంచ వెళ్తుండగా అశ్వాపురం మండలం మొండికుంట వద్ద ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడగా, భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 69 మంది విద్యార్థులు ఉన్నారు.వీరిలో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Facebook
WhatsApp
Twitter
Telegram