సీపీఐ చరిత్ర అంతా పోరాటాలమయం

ఈనెల 18న ఖమ్మంలో జరిగే సభను జయప్రదం చేయండి షాబీర్ పాషా

సీపీఐ వందేళ్ళ  చరిత్ర అంతా పోరాటాలమయం

సీపీఐ వందేళ్ల చరిత్ర అంతా పేదలు, అణగారిన వర్గాల పక్షాన పోరాటాలేననీ ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు.

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / సీపీఐ వందేళ్ల చరిత్ర అంతా పేదలు, అణగారిన వర్గాల పక్షాన పోరాటాలేననీ ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు.భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పుట్టి భారత గడ్డపై నూరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిపిఐ జిల్లా ప్రచార జాతా ఆదివారం కరకగూడెం మండలానికి చేరింది. కరకగూడెం మండలంలో కార్యక ర్తలు భారీగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానుద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా మాట్లాడుతూ భారత కమ్యూ నిస్టు పార్టీ నూరేళ్ల చరిత్రలో అలుపెరగని పోరాటాలు చేసి అను నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్థా యిగా నిలిచిపోయిందన్నారు. అనేక రాష్ట్రాల్లో సాయుధ పోరాటాలు, దేశ వ్యాప్తంగా సమరశీల పోరాటాలు నిర్వహించిన చరిత్ర సిపిఐకి ఉందన్నారు. కమ్యూనిస్టులపై మతోన్మాద దాడులు పెరిగిపోయాయని, ఈ క్రమంలో ప్రజలు చైతన్యవంతులై ఈ మతోన్మాద ప్రభుత్వానికి బుద్ది

చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉందని, ఈ జెండాని ఉమ్మడి జిల్లా ప్రజలు కడుపులోపి పెట్టుకుని ప్రేమించారని ఆయన అన్నారు. పోరా టాల ఖిల్లాగా పేరుపొందిన ఖమ్మం గడ్డపై దేశవ్యాప్త భారత కమ్యూ నిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ జరుగుతుందని, అలాగే పులుసు బొంత ప్రాజెక్టుపై ప్రత్యేకంగా సిపిఐ పార్టీ సర్వతో ఇన్ని సంవత్సరాలనుండి పోరాటాలు చేస్తుందని తెలిపారు దీనిపై ప్రత్యేకంగా ప్రభుత్వానికి విన్నపం చేస్తానని సిపిఐ పార్టీ తరఫున షాబిల్ పాషా తెలిపారు ఈ సభకు వేలాదిగా గ్రామ గ్రామాన సిపిఐ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కరకగూడెం మండల కార్యదర్శి వంగరి సతీష్, జిల్లా అధ్యక్షులు మొన్న లక్ష్మి కుమారి, రాష్ట్ర కార్యసభ్యులు కల్లూరు వెంకటేశ్వర్లు, బుడగం సతీష్, బోడ ముత్తయ్య తదితరులు నాయకులు పాల్గొన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram