లారీ కింద పడి ఇద్దరు యువకుల దుర్మరణం

గోల్డెన్ న్యూస్ / మోత్కూర్ /యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని నర్సాపురం గ్రామం సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగింది ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కాలేజీకి వెళ్లే క్రమంలో పల్సర్ బైక్‌పై భువనగిరి వైపు వెళ్తుండగా వలిగొండ ప్రధాన రహదారిపై లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.మృతులు మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన బోళ్ల దీక్షిత్ , దత్తప్పగూడెం గ్రామానికి చెందిన కుక్కల సాయికుమార్ గా పోలీసులు గుర్తించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం సమాచారం అందుకున్న వెంటనే  బంధువులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఇరు కుటుంబాల్లోనూ ఒక్కగానొక్క కొడుకులే కావడంతో వారి మృతి కుటుంబాలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. తల్లిదండ్రుల ఆర్తనాదాలు అక్కడున్నవారిని కలచివేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram