బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్ష సూచన

శ్రీలంక సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రాబోయే 24 గంటల్లో బలపడి, జనవరి 8 లేదా 9 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో జనవరి 9 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 2-3 రోజుల్లో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉంది.

 

Facebook
WhatsApp
Twitter
Telegram