కవిత రాజీనామా ఆమోదం

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ / తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాకు ఆమోదం లభించింది. ఎమ్మెల్సీ కవిత రాజీనామాను ఆమోదిస్తూ మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం మండలి కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. కవిత నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా భారాస తరఫున 2021 డిసెంబరులో రెండోసారి ఎన్నికయ్యారు. 2022 జనవరిలో ప్రమాణ స్వీకారం చేశారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram