పురుగుల మందు తాగిన యువకుడు.. చికిత్స పొందుతూ మృతి

ఆటో కొనివ్వనందుకు పురుగుల మందు తాగిన యువకుడు.

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / మండల కేంద్రానికి చెందిన అంకమ్మరావు అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామానికి చెందిన నాగయ్య కుటుంబం గృహ నిర్మాణ కార్మికులుగా గత 17 సంవత్సరాలుగా కరకగూడెం మండల కేంద్రంలో జీవనం సాగిస్తున్నారు. మల్ల నాగయ్య కుమారుడు అంకమ్మరావు (19) ఆటో కొనివ్వమని తల్లిదండ్రులను అడిగాడు. వారి ఆర్థిక పరిస్థితి బాగోలేనందున వారు కొనివ్వలేదు. ఈ క్రమంలో డిసెంబర్ 25 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. బంధువులు గమనించి చికిత్స కోసం మణుగూరు  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం కు తరలించారు. డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన తర్వాత మంగళవారం రాత్రి యువకుడి ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ మణుగూరు ఆస్పత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు మృతి చెందాడు .మృతుడిని ఆంధ్ర ప్రదేశ్ లోని సొంత గ్రామానికి తరలించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram